ETV Bharat / entertainment

అల్లరోడి 'ఉగ్రం'.. గోపిచంద్​ 'రామ బాణం'.. బలం చాలట్లేదు! - అల్లరి నరేశ్ ఐదు రోజుల కలెక్షన్స్​

యాక్షన్ హీరో గోపీచంద్ 'రామబాణం'​, విలక్షణ నటుడు అల్లరి నరేశ్​ 'ఉగ్రం'.. కలెక్షన్స్​ ఆశించిన స్థాయిలో వసూళ్లు చేయట్లేదని తెలుస్తోంది. ఐదు రోజుల కలెక్షన్స్​ ఎలా ఉన్నాయంటే?

Allari naresh Ugram  Gopichand Ramabanam collections
అల్లరోడి 'ఉగ్రం'.. గోపిచంద్​ 'రామ బాణం'.. బలం చాలట్లేదు
author img

By

Published : May 10, 2023, 2:25 PM IST

రీసెంట్​గా అల్లరినరేశ్​-గోపిచంద్​.. మే 5న 'ఉగ్రం', 'రామబాణం' చిత్రాలతో థియేటర్లలో ఆడియెన్స్​ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు మిక్స్​డ్​ టాక్​తో ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకో​లేకపోయాయి. ఇంకా చెప్పాలంటే గోపిచంద్ 'రామబాణం'తో పోలిస్తే 'ఉగ్రం'కు కాస్త బెటర్​ టాక్​ వచ్చిందనే చెప్పాలి. తాజాగా ఈ రెండు సినిమాల ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

'నాంది' లాంటి సక్సెస్ ఫుల్ కాంబోలో 'ఉగ్రం' తెరకెక్కడం వల్ల.. రిలీజ్​కు ముందు చెప్పుకోదగ్గ అంచనాలే నెలకొన్నాయి. మొదటి రోజు నెగటివ్ టాక్​ వినపడలేదు. మంచి ప్రయత్నమే చేశారంటూ కాస్త టాక్ వినిపించింది. నరేశ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్​ పరంగా కాస్త డీలా పడిందనే చెప్పాలి. ఎందుకంటే.. వరల్డ్​వైడ్​గా రూ.8కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5కోట్ల ప్రీ రిలీజ్​ బిజినెస్​తో బరిలో దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు వరల్డ్​ వైడ్​గా 5.75 కోట్ల గ్రాస్​.. 2.62 కోట్ల షేర్​ను అందుకుందట.ఐదో రోజు ఈ చిత్రానికి 0.5కోట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో నరేశ్​ పోలీస్‌ ఆఫీసర్​గా సరికొత్త యాక్షన్‌ అవతారంలో కనిపించారు. మిర్నా మేనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితాస్వ, శత్రు, శ్రీనివాస్‌ సాయి, మణికంఠ వారణాసి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది కలిసి చిత్రాన్ని నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రామ‌బాణం సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్​ టాక్​ తెచ్చుకుంది. గోపిచంద్ కెరీర్​లో అతి పెద్ద డిజాస్టర్​గా నిలిచిందనే చెప్పాలి! వ‌రుస ఫెయిల్యూర్స్​తో స‌త‌మ‌తమవుతున్న గోపిచంద్​.. ఈ చిత్రంపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. ఈ సినిమా కలెక్షన్స్​ దారుణంగా పడిపోయాయి. గోపీ, శ్రీవాస్‌ల‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అయినా.. రిలీజ్​కు ముందు సినిమా ట్రైల‌ర్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దీని వ‌ల్ల అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగానే అయ్యాయి. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.20 కోట్లకు పైనే అని తెలిసింది. వరల్డ్ వైడ్​గా రూ.16కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అయితే ఈ చిత్రం ఐదో రోజు 0.5కోట్ల గ్రాస్​ను అందుకుందని సమాచారం. మొత్తంగా ఐదు రోజుల్లో వరల్డ్​ వైడ్​గా 6.95కోట్ల గ్రాస్​, 3.25కోట్ల డిస్ట్రిబ్యూటర్​ షేర్​ వసూలు చేసిందట. ఇకపోతే ఈ చిత్రం 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత శ్రీవాస్​- గోపీచంద్ కాంబినేషన్​లో వచ్చిన మూడో సినిమా ఇది. డింపుల్ హయాతీ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ఖుష్బూ, అలీ, నాజర్, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా త‌దిత‌రులు నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.

ఇదీ చూడండి: ఆస్కార్​ విన్నర్​.. ఏడు పదుల వయసులో ఏడో సంతానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.