ETV Bharat / entertainment

ఇంట్రెస్టింగ్​ టైటిల్​తో అల్లరి నరేశ్.. సూపర్​ సాంగ్​తో మాస్ మహారాజా - raviteja new movies

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో అల్లరినరేశ్​, రవితేజ చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Allari Naresh new movie
Allari Naresh new movie
author img

By

Published : Apr 10, 2022, 12:24 PM IST

Updated : Apr 10, 2022, 1:45 PM IST

AllariNaresh new movie tile: తనదైన కామెడీ టైమింగ్‌, పంచులతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే హీరో అల్లరి నరేశ్‌. హాస్య కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 'గమ్యం'. 'మహర్షి', 'నాంది' వంటి చిత్రాలతో తనలోని నటుడ్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల ఓ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. #నరేశ్​ 59 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్​ మోహన్​ దర్శకత్వం వహిస్తున్నారు. జీస్టూడియోస్​ సమర్పణలో హాస్య మూవీస్​ బ్యానర్​పై దీన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్​ను ఖరారు చేసింది చిత్రబృందం. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అని తెలుపుతూ ఓ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ప్రజలే ప్రధాన అజెండాగా దీని రూపొందిస్తున్నట్లు వ్యాఖ్య జోడించింది. అడవిలోని గిరిజన ప్రజలంతా ఒకేచోట నిలబడి తథేకంగా చూస్తూ ఉన్న ఈ పోస్టర్​ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆనంది హీరోయిన్​గా నటిస్తుండగా వెన్నెల కిషోర్​, చమ్మక్​ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. శ్రీ చరణ్​ పాకాల సంగీతం అందిస్తున్నారు.

allari naresh new movie
అల్లరి నరేశ్ కొత్త సినిమా

Raviteja Ramarao on duty song update: హీరో రవితేజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శరత్ మండవ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ 'బుల్​ బుల్​ తరంగ్​'ను రిలీజ్ చేశారు మేకర్స్. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. రాకెండు మౌలి లిరిక్స్​ అందించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 17న గ్రాండ్​గా సినిమా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ప్రభాస్​ ఫ్యాన్స్​కు దెబ్బ మీద దెబ్బ.. 'స‌లార్' గ్లింప్స్‌ కూడా..

Last Updated : Apr 10, 2022, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.