ETV Bharat / entertainment

మైఖెల్‌ జాక్సన్​లా ప్రభాస్ శ్రీను స్టెప్పులు.. డ్యాన్స్​ సూపర్​ - ఆలీతో సరదాగా ప్రభాస్ శ్రీను మైఖెల్ డ్యాన్స్​

కమెడియన్ ప్రభాస్​ శ్రీను, సీనియర్ నటి తులసి కలిసి ఈ వారం ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ప్రభాస్​ శ్రీను.. తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేశారు. మైఖెల్‌ జాక్సన్‌ స్టెప్పులేసి అలరించారు. ఆ వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. మీరు చూసేయండి..

Alitho Saradaga prabhas sreenu
మైఖెల్‌ జాక్సన్‌లా ప్రభాస్​ శ్రీను స్టెప్పులు
author img

By

Published : Nov 9, 2022, 4:49 PM IST

కమెడియన్ ఆలీ షూటింగ్​ సెట్​లో ఉన్నప్పుడు తనకు సైట్​ కొట్టేవాడని అన్నారు సీనియర్ నటి తులసి. ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రభాస్​ శ్రీనుతో కలిసి విచ్చేసిన ఆమె ఈ విషయాన్ని చెప్పారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ఆలీ- తులసి నటించారు. అప్పుడు 'మీ ఇద్దరికీ ఎలా పరిచయం?' అని ప్రభాస్ శ్రీను అడగగా... తనకు సైట్ కొట్టేవాడని తులసి చెప్పుకొచ్చారు.

ఒక్క ప్రెస్‌మీట్ స్పీచ్​తో.. ఛాన్సులే ఛాన్సులు.. 'కార్తికేయ 2' సినిమాలో తల్లి పాత్రలో తులసి నటించారు. అది పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో ఆమె పాన్ ఇండియా మదర్ అయిపోయారని ఆలీ వ్యాఖ్యానించారు. మధ్యలో అందుకున్న 'ప్రభాస్' శ్రీను... "అన్నా ఆ సినిమా ప్రెస్‌మీట్‌లో అద్భుతంగా మాట్లాడారు. పిచ్చెక్కిపోయింది" అన్నారు. వెంటనే తులసి "సినిమా ఒక ఎత్తు అయితే... ఆ స్పీచ్ వల్ల నాకు ఎన్ని సినిమాలు వచ్చాయంటే, ఏమని చెప్పాలి" అన్నారు. ఒక్క స్పీచ్ చాలా ఛాన్సులు వచ్చాయని పేర్కొన్నారు.

సినీ ఇండస్ట్రీలో తనది 56 ఏళ్ళ ప్రయాణం అని తులసి చెప్పారు. "నేను 1967లో నేను జన్మించాను. మూడో నెలలోనే నేను నటించాను. నాకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు ఓ సినిమాలో డైలాగ్ చెప్పాను. వందేళ్ళ తెలుగు సినిమా ప్రయాణంలో నాది 56 ఏళ్ళ ప్రయాణం" అని తులసి పేర్కొన్నారు. ఆ వెంటనే ప్రభాస్​ శ్రీను కలుగ జేసుకుని "ఇంకో నాలుగు సంవత్సరాలు అయితే షష్ఠిపూర్తి" అని సెటైర్లు వేశారు.

మైఖెల్​ జాక్సన్​లా స్టెప్పులు.. ఇక సినిమాల్లో కామెడీ విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా తనదైన శైలిలో నవ్వులు పూయించే ప్రభాస్ శ్రీను.. ఈ వేదికపై తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేశారు. మైఖెల్‌ జాక్సన్‌ స్టెప్పులేసి అలరించారు. ఈ ప్రోమోకే అది హైలైట్​గా నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​ నవంబరు 14న ప్రసారంకానుంది. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: దిశా పటానీ నాజూకు అందాలు ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.