NTR-Koratala movie Aliabhatt: 'ఆర్ఆర్ఆర్'తో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నారు. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుందని నిన్న మొన్నటి వరకు ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి ఆలియా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివర్లో చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ఆమె వివాహం ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. అయితే తమ పెళ్లి తర్వాత సరదాగా గడిపేందుకు ఆలియా-రణ్‌బీర్ కొంత కాలం షూటింగ్‌లకు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ కారణంతోనే ఆమె ఎన్టీఆర్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కొరటాల శివ శైలి, సామాజిక అంశాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసినట్లు తెలిసింది. 'జనతా గ్యారేజ్' లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కలయిక నుంచి వస్తున్న చిత్రం కావడం వల్ల.. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: నా సినిమాలో బాలయ్యను అలా చూపిస్తా: అనిల్ రావిపూడి