బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్‌కపూర్, ఆలియా భట్.. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది నవంబరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన క్యూట్ బేబీతో గడుపుతోంది. అయితే రణబీర్, ఆలియాలు.. తమ గారాలపట్టికి రాహా అని నామకరణం చేశారు. కానీ ఇంతవరకు ఆమె ముఖాన్ని.. కెమెరాలకు చూపించలేదు. సోషల్‌మీడియాలోను ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయలేదు. అంతే కాకుండా చిన్నారికి రెండేళ్లు వచ్చే వరకు.. ఫొటోలు పోస్ట్ చేయరని ఆలియా సన్నిహితులు తెలిపారు.
తాజాగా ఆలియా చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. గురువారం.. ఆలియా కొన్ని చిన్నపిల్లల చిత్రాలను పోస్ట్ చేసింది. వాటిలో పింక్ డ్రెస్ వెేసుకున్న ఓ బేబీ ఫొటో.. నెటిజన్లను ఆకర్షించింది. ఆ చిన్నారి క్యూట్‌నెస్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఆ ఫొటోపై నెట్టింట చర్చ మొదలైంది. చాలా మంది.. అది రణ్‌బీర్-ఆలియా గారాలపట్టి రాహా ఫొటో అని వాదిస్తున్నారు. మరికొందరు అది రాహా కాదని అంటున్నారు. ఆలియా కూతురు సేమ్ అలానే ఉంటుందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
![Alia Bhatt share first glimpse of daugter Raha Kapoor? Users Comments these](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17769393-_2.png)
![Alia Bhatt share first glimpse of daugter Raha Kapoor? Users Comments these](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17769393-_1.png)
అసలు విషయమేమిటంటే?
ఆలియా భట్.. గర్భిణీగా ఉన్నప్పుడు ఓ బేబీ వేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. అందుకు సంబంధించిన ప్రమోషన్ కోసం ఆమె తరచూ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే గురువారం కూడా షేర్ చేసింది. కానీ, అది రాహా చిత్రమంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. అయితే దానిపై ఆలియా స్పందిస్తుందేమో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బాలీవుడ్ స్టార్లు.. ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ 2022 ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన రెండు నెలలకే.. ఆలియా తాను గర్భవతి అని ప్రకటించింది. పెళ్లైన రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ కావడంపై అందరూ ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, గతేడాది నవంబరు 6న ఆలియా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.