Ponniyin Selvan 2 overall collections : పొన్నియిన్ సెల్వన్ 2.. కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియాలో సంచలనాలు సృష్టిస్తున్న సినిమా. 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ కథను కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందించారు. పలువురు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ ఇది పట్టాలెక్కలేపోయింది. అయితే పలు ప్రయత్నాల తర్వాత ఈ సినిమాను విజయవంతంగా తెరకెక్కించారు అగ్ర దర్శకుడు మణిరత్నం. తొలి భాగం సినిమా గతేడాది విజయవంతంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు రెండో భాగం కూడా అదే స్థాయిలో ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించడమే కాకుండా కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది.
ఓపెనింగ్‌లోనే అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకున్న పీఎస్ 2.. రెండో రోజుకు వచ్చేసరికి రూ. 24 కోట్ల కలెక్షన్‌ను రాబట్టింది. ఇందులో తమిళ ఆడియన్స్ షేర్ 59.47%గా నమోదైందని ట్రేడ్ వర్గాల టాక్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3200 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే రూ.170కోట్ల మేర వసూళ్లు చేసినట్లు సమాచారం.
Ponniyin Selvan 2 day 2 collection : ఇక పీఎస్ 2 సినిమా విషయానికి వస్తే.. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, విక్రమ్ లాంటి స్టార్స్ వారి వారి పాత్రల్లో అద్భుతంగా చేశారని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. అన్నీ భాషల్లోనూ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద అంతకంటే ఎక్కువగా వసూళ్లు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
'ఏజెంట్' డే 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ?
Akhil Agent overall collections : అక్కినేని నట వారసుడు అఖిల్ వైల్డ్ లుక్‌లో దర్శనమిచ్చిన సినిమా 'ఏజెంట్'. ఏప్రిల్ 28న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజుకు 2.60 కోట్లు సంపాదించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. రా ఏజన్సీ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, సంపత్ రాజ్, మురళీ శర్మ లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించారు.యాక్షన్ పరంగా అఖిల్ తన ఎఫర్ట్ పెట్టినప్పటికీ ఈ సినిమా కొంత మేర ఆడియన్స్‌ను నిరాశపరిచిందని టాక్.