ETV Bharat / entertainment

అఖిల్ 'ఏజెంట్'​-'పొన్నియిన్​​ సెల్వన్​ 2'.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే? - ఏజెంట్ తొలి రోజు కలెక్షన్స్

అక్కినేని అఖిల్ ఏజెంట్, దర్శకుడు మణిరత్నం 'పొన్నియిల్ సెల్వన్​ 2' తొలి రోజు కలెక్షన్స్​ వివరాలు బయటకు వచ్చాయి. ఎంతంటే?

Akhil Agent and Maniratnam ponniyan selvan 2 first day worldwide collections
అఖిల్ 'ఏజెంట్'​-'పొన్నియిల్​ సెల్వన్​ 2'.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
author img

By

Published : Apr 29, 2023, 4:15 PM IST

Updated : Apr 29, 2023, 4:33 PM IST

దర్శకుడు సురేందర్ రెడ్డి-అక్కినేని అఖిల్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. ఏప్రిల్​ 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద మిక్స్​డ్​ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా నిరాశపరిచాయి. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రా, తెలంగాణా కలిపి రూ. 4 కోట్లు.. ఇతర భాషల్లో రూ. 3 కోట్లు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ సినిమా రూ.80కోట్ల బడ్జెట్​తో రూపొందిందని ప్రచారం సాగింది. ప్రీ రిలీజ్​ బిజినెస్ 36.20 కోట్లు జరిగిందని తెలిసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.37 కోట్లుగా ఉంది. అంటే ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా రూ. 32.05 కోట్లను వసూలు చేయాలి. అయితే ఇంత మొత్తం వసూలు చేయడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. కాగా, ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ నటించింది. హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దూకుడుగా పొన్నియిల్ సెల్వన్​.. దిగ్గజ దర్శకుడు మ‌ణిర‌త్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్ 2'. గ‌తేడాది రిలీజై సూపర్​హిట్​గా నిలిచిన 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' చిత్రానికి కొన‌సాగింపు. చోళు రాజుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కూడా ఏప్రిల్ 28నే వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్​గా రిలీజైంది. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్​ టాక్​ను తెచ్చుకుంది. కలెక్షన్స్​ కూడా మంచిగానే వసూలు అయ్యాయని తెలిసింది. తమిళనాడు - రూ. 17.10 కోట్లు, ఏపీ-తెలంగాణ - రూ. 2.80 కోట్లు, కర్ణాటక - రూ. 4.05 కోట్లు, కేరళ - రూ. 2.82 కోట్లు, రెస్టాఫ్ ఆఫ్ ఇండియా - రూ. 2.55 కోట్లు, ఓవర్ సీస్ - రూ. 24.70 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మొత్తంగా వరల్డ్​వైడ్​గా రూ. 54.02 కోట్ల గ్రాస్ కలెక్ష‌న్స్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​ రూ.170కోట్లు చేసినట్లు తెలిసింది. అంటే దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్​ రూ.172కోట్లు. ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మీ, త్రిష, శోభితా ధూళిపాల, ప్రకాశ్‌ రాజ్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

ఇదీ చూడండి: 'థియేటర్లలో ఆడియెన్స్​ అరుపులు మామూలుగా లేవు!'.. 'ఏజెంట్'​ ట్రోల్స్​పై అమల రియాక్షన్​ ఇదే!!

Last Updated : Apr 29, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.