26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించగా శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. తెలుగు ప్రచార చిత్రాన్ని మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటలను ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపించింది. లుక్స్, నటనపరంగా శేష్ మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ధగడ్ సాంబ' ట్రైలర్..
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా ప్రవీణ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'ధగడ్ సాంబ'. కథ, మాటలు, దర్శకత్వం, సాహిత్యం ఎన్ఆర్ రెడ్డి సమకూర్చిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో లాంఛనంగా విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ నటులు సాయికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ధగడ్ సాంబ ట్రైలర్ ను ఆవిష్కరించి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన చిత్ర బృందం.... ధగడ్ సాంబ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వేదికపై సంపూర్ణేశ్ బాబు గుక్కతిప్పుకోకుండా డైలాగ్ చెప్పి సాయికుమార్ ను ఆశ్చర్యపోయేలా చేయడం విశేషం.
ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ 'లైగర్' వేట మామూలుగా లేదుగా..!