Adipurush Day 5 Collections : ఆదిపురుష్ సినిమా టికెట్ ధర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధికారికంగా ప్రకటించింది. గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు తగ్గిన ధర అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇక నుంచి రూ.150కే 3డీలో సినిమాను వీక్షించవచ్చని టీ సిరీస్ తెలిపింది. అయితే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది. కర్ణాటకతో పాటు నార్త్ ఆడియన్స్‌కు మాత్రమే టికెట్ డిస్కౌంట్ వర్తించనున్నట్లు తెలుస్తోంది.
-
Experience the epic tale in 3D on the big screen at the most affordable price! Tickets starting at Rs150/-* ✨
— T-Series (@TSeries) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Offer not valid in Andhra Pradesh, Telangana, Kerala and Tamil Nadu
3D Glass Charges as applicable.
Book your tickets on:https://t.co/0gHImE23yj#Adipurush now in… pic.twitter.com/UU5PiNcEbt
">Experience the epic tale in 3D on the big screen at the most affordable price! Tickets starting at Rs150/-* ✨
— T-Series (@TSeries) June 21, 2023
Offer not valid in Andhra Pradesh, Telangana, Kerala and Tamil Nadu
3D Glass Charges as applicable.
Book your tickets on:https://t.co/0gHImE23yj#Adipurush now in… pic.twitter.com/UU5PiNcEbtExperience the epic tale in 3D on the big screen at the most affordable price! Tickets starting at Rs150/-* ✨
— T-Series (@TSeries) June 21, 2023
Offer not valid in Andhra Pradesh, Telangana, Kerala and Tamil Nadu
3D Glass Charges as applicable.
Book your tickets on:https://t.co/0gHImE23yj#Adipurush now in… pic.twitter.com/UU5PiNcEbt
అటు కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. నాలుగు, ఐదు రోజులలో వసూళ్లు కొద్ది మేర తగ్గాయి. కాగా ఐదు రోజుల్లో సినిమా రూ.395 కోట్లు రాబట్టింది. వీకెండ్లో కలెక్షన్ల జోరు కొనసాగించిన 'ఆదిపురుష్' గత రెండు రోజుల నుంచి నెమ్మదించింది. వరుసగా మూడు రోజులు వంద కోట్లు దాటిన వసూళ్లు.. నాలుగు, ఐదు రెండు రోజుల్లో కలిపి రూ.55 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేకపోవడం వల్ల.. రానున్న వీకెండ్లో కలెక్షన్లు మళ్లీ పుంజుకోవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'ఆదిపురుష్' రోజువారి కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
-
We are thankful for the immense love and devotion you all have shown for Adipurush ❤️ Jai Shri Ram 🙏
— T-Series (@TSeries) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar… pic.twitter.com/ohRra8qUmH
">We are thankful for the immense love and devotion you all have shown for Adipurush ❤️ Jai Shri Ram 🙏
— T-Series (@TSeries) June 21, 2023
Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar… pic.twitter.com/ohRra8qUmHWe are thankful for the immense love and devotion you all have shown for Adipurush ❤️ Jai Shri Ram 🙏
— T-Series (@TSeries) June 21, 2023
Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar… pic.twitter.com/ohRra8qUmH
ఆదిపురుష్ కలెక్షన్లు (వరల్డ్ వైడ్) :
- మొదటి రోజు - రూ. 140 కోట్లు
- రెండో రోజు - రూ. 100 కోట్లు
- మూడో రోజు - రూ. 100 కోట్లు
- నాలుగో రోజు - రూ. 35 కోట్లు
- ఐదో రోజు - రూ. 20 కోట్లు
డైలాగ్స్ ఛేంజ్..
ఇక ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు రామభక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు నుంచి విమర్శలు వచ్చిన కారణంగా.. అభ్యంతరకరంగా ఉన్న వాటిని తొలగించి సినిమాను రీ-ఎడిట్ చేసినట్లు చిత్రయూనిట్ తెలిపింది. కాగా రెండు రోజులుగా తగ్గిన కలెక్షన్లు సినిమాపై ప్రభావం చూపకుండా ఉండేందుకు.. ఎడిట్ వెర్షన్‌ను తగ్గించిన ధరతో థియేటర్లలో ప్రదర్శించాలని నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
'ఆదిపురుష్' సినిమాలోని కొన్ని డైలాగ్స్ ప్రేక్షకుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ.. సోషల్‌మీడియాలో వచ్చిన విమర్శలపై ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ శుక్లా స్పందించారు. ప్రేక్షకులకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నామని.. త్వరలోనే మార్చిన డైలాగులతో సినిమా ప్రదర్శిస్తామని ఆయన ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో గురువారం నుంచి ఎడిట్ వెర్షన్ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
ప్రభాస్ సలార్ నుంచి అప్డేట్..
ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్'. అయితే తాజాగా సలార్ మూవీటీమ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సినిమాకు రిలీజ్‌కు 100రోజుల కౌంట్‌డౌన్ ఉన్నట్లు తెలిపింది. ప్రపంచానికి సీపీఆర్ ఇచ్చే టైమ్ వచ్చేసింది. సలార్ సెప్టెంబర్ 28న వచ్చేస్తుంది రెడీగా ఉండండి అని చెబుతూ ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా కేజీయఫ్‌కు కనెక్షన్ ఉందని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌ను కాస్త బ్రైటనెస్ పెంచి చూస్తే.. అందులో కొన్ని బాక్సులు కనిపిస్తున్నాయి. అయితే అవి కేజీయఫ్ 2లో రాఖీ భాయ్ సముద్రంలో పడేసిన బంగారం బాక్సులు అని నెటిజన్లు, సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు చూడాల్సిందే.