Adah sharma health : నటి అదాశర్మ అస్వస్థతకు గురైంది. ఫుడ్ అలర్జీ, డయేరియాతో అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చేర్చినట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటుందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది తెలుసుకుంటున్న సినీ ప్రియులు ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఆమెకు సంబంధించి పోస్ట్‌లు పెడుతూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.
Adah sharma heart attack movie : టాలీవుడ్లో 'హార్ట్ ఎటాక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఆదాశర్మ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అందులో ఆమె అందం కూడా యూత్‌ను బానే ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో హీరోయిన్‌గా, అలాగే సహాయ నటిగా రాణిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది.
Adah sharma Kerala story movie : రీసెంట్గా ఈ ఏడాది రిలీజైన 'ది కేరళ స్టోరీ'తో ఆదాశర్మ దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ ముందు ఊహించని రేంజ్లో వసూళ్లను అందుకుంది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంతకీ వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతోనే దర్శకుడు సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
Adah sharma comamndo movie : ఇకపోతే కేరళ స్టోరీ సినిమా తర్వాత అదా శర్మ కమాండో చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ నెల ఆగస్టు 11న నుంచి ఓటీటీ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఆదాశర్మ ఫుల్ బిజీగా ఉంటోంది. అలా గత కొన్నిరోజులుగా బిజీ బిజీగా గడుపుతున్న ఆమె.. తాజాగా అస్వస్థతకు ఆస్పత్రిలో చేరిందని కథనాలు వస్తున్నాయి.
సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా.. ఆదాశర్మ సోషల్‌మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ డిఫరెంట్ ఫొటోషూట్లతో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో హాట్ ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంటుంది. అవి నెట్టింట్లో వైరల్ కూడా అవుతుంటాయి.
ఇదీ చూడండి :
మొహం నిండా గాయాలు.. మైనస్ 16 డిగ్రీల్లో 40 గంటల పాటు.. అదాశర్మకు ఏమైంది?