ETV Bharat / entertainment

ప్రముఖ నటుడి​ ఇంట్లో భారీ చోరీ.. 250 సవర్ల బంగారం మాయం.. వాచ్​మెన్​ పనే.. - నటుడు రాధాకృష్ణన్ ఇంట్లో సినిమాలు

కోలీవుడ్​ ప్రముఖ నటుడు రాధాకృష్ణన్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఆయన ఇంట్లో పనిచేసే వాచ్​మెన్​తో పాటు అతడి స్నేహితులు పక్కా స్కెచ్​ ప్రకారం ఇంట్లో ఉన్న మొత్తం బంగారాన్ని, నగదును ఎత్తుకెళ్లారు.

actor Radhakrishnan
నటుడు రాధాకృష్ణన్
author img

By

Published : Nov 12, 2022, 3:02 PM IST

తమిళనాడులోని చెన్నైలో నివాసం ఉంటున్న కోలీవుడ్​ నటుడు రాధాకృష్ణన్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. కొన్నేళ్లుగా ఆయన ఇంట్లో పనిచేస్తున్న వాచ్​మెన్​తో పాటు అతడి స్నేహితులు.. రాధాకృష్ణన్​ ఇంట్లో ఉన్న మొత్తం బంగారాన్ని, డబ్బును దోచుకెళ్లారు.

రాధాకృష్ణన్​ ఇంట్లో పనిచేస్తున్న వాచ్​మెన్​ రమేశ్​, అతడి స్నేహితులు పక్కా ప్లాన్​​ ప్రకారం.. ఆయన భార్య రాజీ ఒక్కరే ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించారు. రాజీని కత్తి చూపించి బెదరించాారు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు కట్టేసి నోటికి ప్లాస్టర్​ వేశారు. ఇక దొరికిందే ఛాన్స్​ అనుకుంటూ ఇంట్లో ఉన్న 250 సవర్ల బంగారాన్ని, రూ.3 లక్షల నగదును తీసుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఇదీ చదవండి: బ్యాట్​మ్యాన్ స్వరం మూగబోయింది.. ఆయన ఇక లేరు

సంక్రాంతి బరిలో బాలయ్య, చిరు.. విడుదల విషయంలో అయోమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.