ETV Bharat / entertainment

400 హిట్లు, 50 బ్లాక్ బస్టర్లు- ఆ స్టార్ ఎవరో తెలుసా? - ప్రేమ్​ నజీర్ హిట్ మూవీస్

Actor Who Has 400 Hit Films : 80వ దశకంలో బాక్సాఫీస్‌ను ఏలిన ఓ సూపర్ స్టార్ గురించి మీకు తెలుసా? హీరోగా అత్యధిక హిట్ చిత్రాలను అందించిన ఆ ప్రముఖ నటుడు ఎవరో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈయన గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే ?

Actor Who Has 400 Hit Films
Actor Who Has 400 Hit Films
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 2:15 PM IST

Actor Who Has 400 Hit Films : సాధారణంగా సినీ స్టార్స్ తమ కెరీర్​లో సరైన అవకాశాలు అందిపుచ్చుకుని సినిమాలు తెరకెక్కిస్తూ అభిమానులకు దగ్గరవుతుంటారు. అందులో కొందరు వరసు సక్సెస్​లు అందుకుని దూసుకెళ్తే, మరికొందరు మాత్రం కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కొని స్టార్​డమ్​ను అందుకుంటారు. అయితే తమ ప్రేక్షకుల నాడిని తెలుసుకుని సినిమాలు చేసేవారు చాలా మంది మంచి సక్సెస్​ను అందుకున్నారు. అలా 80వ దశకానికి చెందిన ఓ స్టార్ హీరో అత్యధిక హిట్ చిత్రాలను అందుకుని రికార్డుకెక్కారు. ఇంతకీ ఆయన ఎవరంటే ?

బ్లాక్​ అండ్ వైట్​ ఎరాలో మలయాళ సినీ ఇండస్ట్రీని షేక్​ చేశారు నటుడు ప్రేమ్ నజీర్. 50స్​ నుంచి 80స్​ వరకు ఆయన బాక్సాఫీస్‌ను ఏకపక్షంగా శాసించారు. కెరీర్‌లో దాదాపు 900 సినిమాలు చేసిన ప్రేమ్, హీరోగా 720 సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. అలా తన ఖాతాలో 400 హిట్ చిత్రాలను వేసుకున్నారు. అందులోనూ వాటిలో 50 బ్లాక్ బస్టర్లు కావడం విశేషం. అయితే ఇప్పటి వరకు ఆయన రికార్డును ఏ సూపర్ స్టార్ కూడా టచ్ చేయలేకపోయారు.

బాలీవుడ్, దక్షిణాది సూపర్ స్టార్స్ కూడా ఆయన రికార్డు దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. బిగ్​బీ అమితాబ్ బచ్చన్ 56 విజయవంతమైన చిత్రాలను అందించగా, బాలీవుడ్ స్టార్ హీరో దివంగత రాజేశ్​ ఖన్నా కూడా 42 హిట్ సినిమాల్లో నటించారు. షారుక్, సల్మాన్ వంటి స్టార్స్​ ఖాతలో ఇప్పటి వరకు 30-35 హిట్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇక సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇప్పటి వరకు తన కెరీర్‌లో 100కి మించి హిట్స్ ఇవ్వలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రేమ్ నజీర్ కెరీర్ :
Prem Nazir Career : 1926లో జన్మించిన ప్రేమ్ నజీర్ చిన్న వయస్సులోనే థియేటర్ ఆర్టిస్ట్​గా పనిచేశారు. చదువు పూర్తయ్యాక 1952లో విడుదలైన 'మరుమ్‌కల్‌'తో సినీ తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆయన అసలు పేరును కూడా మార్చేసింది. అలా అబ్దుల్ ఖాదర్ కాస్త ప్రేమ్ నజీర్​గా మారిపోయారు . పౌరాణిక, చారిత్రక చిత్రాలలో ఎంత పాపులర్ అయ్యారో రోమాంటిక్, విషాద చిత్రాలతో కూడా అంతే ప్రజాదరణ పొందారు. 60,70వ దశకంలో ప్రేమ్ నజీర్ మలయాళ సినిమా రారాజుగా నిలిచారు. 20 ఏళ్లలో ఏటా డజనుకు పైగా హిట్ చిత్రాలను అందించారు.

Actor With No Box Office Clash : సోలోగా వచ్చి రికార్డులు బ్రేక్ .. 13 ఏళ్లుగా ఈ స్టార్​ హీరోకు అసలు పోటీనే లేదుగా!

10ఏళ్ల క్రితం ఆ మూవీకి రూ.275కోట్ల రెమ్యునరేషన్​- అప్పటి నుంచి అన్నీ ఫ్లాపులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.