ETV Bharat / entertainment

మహేశ్​బాబుతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన తరుణ్​ - త్రివిక్రమ్​ సినిమాలో తరుణ్​

మహేశ్​బాబు త్రివిక్రమ్​ సినిమాలో నటించే విషయమై క్లారిటీ ఇచ్చాడు నటుడు తరుణ్​. ఏమన్నారంటే

tarun
తరుణ్​
author img

By

Published : Aug 31, 2022, 5:17 PM IST

గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో తన గురించి వస్తోన్న వార్తలపై స్పందించారు నటుడు తరుణ్​. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. మహేశ్‌బాబు సినిమాతో ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. మహేశ్‌ సినిమాలో తాను నటించడం లేదని.. సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చారు. తన జీవితంలో ఏం జరిగినా తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటానని తెలిపారు.

'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఎస్​ఎస్​ఎమ్​బీ 28గా ఇది ప్రచారంలో ఉంది. పూజాహెగ్డే కథానాయిక. త్వరలోనే ఈ సినిమా షూట్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం చిత్రబృందం తరుణ్‌ని సంప్రదించిందని, రోల్‌ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చేశారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. తరుణ్‌ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో ఆ ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

ఇదీ చూడండి: Filmfare awards 2022.. ఉత్తమ నటులుగా రణ్​వీర్​, కృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.