ETV Bharat / entertainment

ఆ ఇద్దరు నిర్మాతలకు సుదీప్‌ డెడ్‌ లైన్‌.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా!

Sudeep Defamation On Producers : నటుడు సుదీప్​.. ఇద్దరు నిర్మాతలపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మూడు రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అసలు సుదీప్​ దావా ఎందుకు వేశారు? ఆ నిర్మాతలెవరు?

actor sudeep files defamation case against film producers

author img

By

Published : Jul 8, 2023, 9:29 PM IST

Sudeep Defamation On Producers : శాండిల్​వుడ్​ నటుడు సుదీప్​.. నిర్మాతలు ఎం.ఎన్​ కుమార్​, ఎం.ఎన్​ సురేశ్​పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తన గురించి విమర్శలు చేసినందుకు గాను మూడు రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ మేరకు ఆయన లీగల్‌ టీమ్‌ తాజాగా ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.

సుదీప్​ కుటుంబం ఎంతో మానసిక వేదనకు గురై..
Sudeep Family : "నిర్మాతలు ఎం.ఎన్‌.కుమార్‌, ఎం.ఎన్‌.సురేశ్‌ చేసిన ఆరోపణలతో సుదీప్‌, ఆయన కుటుంబం మానసిక వేదనకు గురైంది. వాళ్ల మాటలు ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన ఇమేజ్‌కు భంగం కలిగించాయి. తనని అభిమానించే, ఆదర్శంగా తీసుకునే ప్రేక్షకులు సైతం ఈ విషయంపై చర్చించుకోవడం ఆయన్ని ఎంతగానో కలచివేసింది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు సుదీప్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఆరోపణల వల్ల ఆయనతో సినిమాలు చేయడానికి వాళ్లు భయపడుతున్నారు. ఇచ్చిన ఆఫర్లను కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు" అని ఆ స్టేట్‌మెంట్‌లో రాసి ఉంది.

'ఎనిమిదేళ్ల క్రితం అడ్వాన్స్​ తీసుకుని.. బ్యానర్​లో సినిమాలు.. '
Sudeep Advance Controversy : కొన్ని రోజుల క్రితం.. సుదీప్​ గురించి ఎం.ఎన్‌.కుమార్‌, ఎం.ఎన్‌.సురేశ్‌ ఆరోపణలు చేశారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం సుదీప్‌ తన వద్ద నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నారని ఆరోపించారు. ఆనాటి నుంచి ఇప్పటివరకూ తమ బ్యానర్‌లో సినిమా చేయలేదని, తమని తప్పించుకుని తిరుగుతున్నారంటూ ఆరోపణలు చేశారు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..
Sudeep Movie Career : కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు సుదీప్‌.. హీరో, ప్రతినాయకుడిగా ఎన్నో ఏళ్ల నుంచి తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు చిత్రాల ద్వారా ఆయన తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. అయితే సుదీప్​.. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. విక్రాంత్‌ రోణ చిత్రం తర్వాత ఆయన ఇటీవల మరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.