Acharya Promotions: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న 'ఆచార్య'.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న ప్రేక్షకుల మందుకు రానుంది. కొరటాల- మెగాస్టార్ కాంబినేషన్ కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ అదిరిపోయినందున.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్చరణ్ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల మెగా అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'చిరుత' నుంచి 'ఆచార్య' వరకు చరణ్లో గమనించిన తేడా ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చిరు సమాధానమిచ్చారు.
"మొదటి నుంచి నాకెప్పుడు చరణ్ ఏ విషయంలో తప్పు చేస్తున్నాడని అనిపించలేదు. బహుశా నా కన్న బిడ్డ కనుక అతడిపై ఉన్న ప్రేమ కవర్ చేస్తుందేమో. అయితే బయట వాళ్లు ఏం అనుకుంటున్నారని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ అందరూ చరణ్ బాగా నటిస్తున్నాడని చెప్పేవారు. ఏ హీరో అయినా మొదటి చిత్రం నుంచే అద్భుతంగా నటిస్తే.. అతడి ఒకటి రెండు సినిమాలు అయ్యాక ఓవర్ అనిపిస్తుంది. ఇక, మొదటి చిత్రం నుంచి చరణ్ అన్ని విషయాల్లో అంచెలంచెలుగా డెవలప్ అయ్యాడు." -మెగాస్టార్ చిరంజీవి
సినీ రంగంలో కావలసిన మెలకువలను చరణ్ బాగా నేర్చుకున్నాడని చిరంజీవి అన్నారు. "హెల్దీ డెవలప్మెంట్ అంటే అది.. అలాంటి వృద్ధిని అభిమానులు ఆస్వాదిస్తారు, ఆమోదిస్తారు. ఇప్పుడు అభిమానులే చూస్తున్నారు కదా.. మొదటి సినిమాకి ఇప్పుడుకి చరణ్లో ఎంత తేడా వచ్చిందో." అని చిరు చెప్పుకొచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. రెజీనా ఓ ప్రత్యేకంగా గీతంలో సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..