2023 Top 5 Highest Box Office Collection : 2023 సంవత్సరం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలు విడుదల కాగా.. వాటిలో కొన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులను నమోదు చేయగా.. మరికొన్ని మంచి కంటెంట్‌తో విజయం నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.
- బార్బీ
హాలీవుడ్ సినిమా 'బార్బీ'.. జూలై 21న రిలీజై.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో బార్బీ.. టాప్‌లో నిలిచింది. ఈ క్రమంలో బార్బీ , ప్రపంచవ్యాప్తంగా 1.38బిలియన్ డాలర్లు వసూల్ చేసింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్ కిన్నన్, విల్ ఫెర్రెల్, అమెరికా ఫెరెరా, ఇస్సా రే, సిము లియులు నటించారు. - సూపర్ మారియో బ్రోస్
బార్బీ తర్వాత ఈ ఏడాది ఎక్కువ వసూళ్లు చేసిన సినిమా 'సూపర్ మారియో బ్రోస్'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.35 బిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిది. ఈ సినిమాలో అన్య టేలర్-జాయ్, క్రిస్ ప్రాట్, జాక్ బ్లాక్ మరియు సేథ్ రోజెన్ లు నటించారు. - ఓపెన్ హైమర్
ప్రముఖ అమెరికన్ ఫిజిస్ట్ రాబర్ట్ కథ ఆధారంగా.. 'ఓపెన్ హైమర్' తెరకెక్కింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అటామిక్ బాంబు తయారు చేయడంలో ఆపెన్ హైమర్ పాత్రను ఇందులో చూపించారు. బార్బీ రిలీజైన అదే వారంలో ఈ సినిమా కూడా థియేటర్లకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 853మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. - గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ, వోల్యూమ్ 3
గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వోల్యూమ్ 3.. ప్రపంచవ్యాప్తంగా 845 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో క్రిస్ ప్రాట్, చుక్వుడి ఇవుజి, బ్రాడ్లే కూపర్ కీలక పాత్రలో నటించారు. - ఫాస్ట్ ఎక్స్
హాలీవుడ్ స్టార్ విన్ డిజిల్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ఫాస్ట్ ఎక్స్. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను.. ఫాస్ట్ ఎక్స్ ఎంతగానో అలరించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 704 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వసూల్ చేసింది.
చరిత్ర సృష్టించిన 'అవతార్-2'.. భారత్‌లో తొలి చిత్రంగా రికార్డ్!