ETV Bharat / elections

తలాఖ్​: హృదయాలు గెలిచారు.. మరి ఓట్లు? - సుప్రీం

"తలాఖ్​ విషయంలో మోదీ చాలా మంచి పని చేశారు. కానీ ఓటు మాత్రం భాజపాకు వేయం. నా భర్త ఎవరికి వేయమంటే వారికే నా ఓటు"... అనేక మంది ముస్లిం మహిళల మాట ఇది. ఈ విచిత్ర పరిస్థితిని కమలదళం ఎలా ఎదుర్కొంటుంది?

తలాఖ్​: హృదయాలు గెలిచారు.. మరి ఓట్లు?
author img

By

Published : Apr 9, 2019, 12:37 PM IST

తలాఖ్​: హృదయాలు గెలిచారు.. మరి ఓట్లు?

2017 ఆగస్టు 22... చారిత్రక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ముమ్మారు తలాఖ్ విధానం చెల్లదని, అక్రమమని తేల్చిచెప్పింది. తలాఖ్​ విషయంలో కేంద్రం చట్టం చేయాలని ఆదేశించింది.

2017 డిసెంబర్ 28​... ముమ్మారు తలాఖ్​ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన బిల్లును లోక్​సభ ఆమోదించింది.

ఏడాది దాటింది. అయినా తలాఖ్​ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేదు. మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు. బిల్లులో కొన్ని మార్పులు. మూడు సార్లు ఆర్డినెన్సులు.

ముమ్మారు తలాఖ్​ విధానంతో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందన్నది అన్ని ప్రధాన పార్టీల మాట. సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించారు. కానీ... సభలో మాత్రం ఎవరి దారి వారిదే.

ఎందుకిలా అంటే... ఎవరి కారణాలు వారివి.

"ముమ్మారు తలాఖ్​ వంటి అమానుష సంస్కృతికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చినప్పుడు నన్ను ఎన్ని మాటలన్నారు? ముమ్మారు తలాఖ్​ బాధితులు, ఆ సంప్రదాయానికి భయపడుతున్న నా సోదరీమణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మాకు మద్దతు ఇవ్వండి. మా బలం పెంచండి. మీ భద్రతకు మాది భరోసా."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"ముమ్మారు తలాఖ్​ పేరుతో ఒక బిల్లు తీసుకువచ్చారు. మోదీ ముస్లిం మహిళలలకు పురుషులతో పోరాడే శక్తి ఇచ్చారనుకున్నాం. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళలు సాధికారత సాధిస్తారని ఆశించాం. కానీ... ముస్లిం పురుషులను జైల్లో పెట్టించడానికి, పోలీస్​ స్టేషన్​లో నిలబెట్టడానికి నరేంద్రమోదీ తయారు చేసిన మరో ఆయుధం ఇది. అందుకే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ ముమ్మారు తలాఖ్​ చట్టాన్ని రద్దుచేస్తుంది."
-సుస్మితా దేవ్​, అఖిల భారత మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు

జనం మాటేంటి...?

ముమ్మారు తలాఖ్​ చట్టం తెస్తే ముస్లిం మహిళలు తమకే మద్దతిస్తారని భాజపా నేతలు ఎప్పటినుంచో లెక్కలేసుకుంటున్నారు. ఇప్పుడు పరీక్షా సమయం. తలాఖ్​ విషయంలో భాజపాపట్ల ముస్లిం మహిళల్లో ఏర్పడ్డ సానుకూలత... ఓట్లుగా మారుతుందా లేదా అన్నదే ప్రశ్న.

ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్. 2014లో అక్కడ ఉన్న 8 లోక్​సభ నియోజకవర్గాల్లోనూ భాజపాదే విజయం. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కైరానా మాత్రం చేజారింది.
పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​లోని 8 నియోజకవర్గాలకు ఏప్రిల్​ 11న పోలింగ్ జరగనుంది. ఓటర్ల సంఖ్య కోటిన్నర. అందులో 35శాతం మంది ముస్లింలే. వీరిలో మంది భాజపాకు ఓటేస్తారన్నది ఆసక్తికరం.

"మా ఆయన ఒప్పుకోరు..."

తలాఖ్​ చట్టం చేసేందుకు ప్రయత్నించిన భాజపాపట్ల ముస్లిం మహిళలు సానుకూలంగా ఉన్నా... ఓటు వేసే విషయంలో మాత్రం వారిది భిన్నాభిప్రాయం. ముజఫర్​నగర్​, కైరానా, మేరఠ్​, బాగ్​పత్​ వంటి ప్రాంతాల ఓటర్లతో మాట్లాడితే ఈ విషయం అర్థమవుతోంది.

"ముమ్మారు తలాఖ్​ అత్యంత హేయం. ఇలా చెప్పినవారికి చట్టపరంగా శిక్షపడాల్సిందే. మా గురించి ఆలోచించినందుకు భాజపాకు ధన్యవాదాలు. కానీ... నేను నా భర్త చెప్పిన పార్టీకే ఓటేస్తా. ఆయనకు భాజపా అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయను."

-కైసర్​ జహాన్​, గృహిణి, ముజఫర్​పుర్​

వెంటనే కైసర్​ భర్త అస్లాం వచ్చి, ఆమెను లోపలికి తీసుకెళ్లిపోయాడు. "మా మతంలో జోక్యం చేసుకోవద్దు. రాజకీయాలు జోడించవద్దు" అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

"ముమ్మారు తలాఖ్​ చెడు సంప్రదాయం. కానీ మేము భాజపాకు ఓటు వేయం. నా భర్త చెప్పినట్లు అఖిలేశ్​ ఎవరిని పోటీకి దింపితే వారికే ఓటేస్తాం."
-రబియా, గృహిణి, కైరానా

ముమ్మారు తలాఖ్​ను వ్యతిరేకిస్తూనే... వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తప్పుబట్టారు మరికొందరు మహిళలు. దేవుడే అన్నీ చూసుకుంటాడన్నది వారి మాట. ఇలా అనేక మంది ముస్లిం మహిళలు భాజపాకు ఓటు వేసే విషయంలో సందిగ్ధ స్థితిలోనే ఉన్నారు.

ముమ్మారు తలాఖ్​ బాధితులు మాత్రం భాజపాకే మద్దతు ప్రకటించారు.

"నా భర్త నాకు విడాకులు ఇచ్చాడు. మరో మహిళను పెళ్లాడాడు. ఆ నిర్ణయాన్ని అంగీకరించడం మినహా నాకు మరో మార్గం లేదు. ఇప్పుడు నేను నా నాలుగేళ్ల కొడుకుతో ఉంటున్నాను. ముమ్మారు తలాఖ్​ దుర్మార్గపు చర్య. ముస్లిం మహిళలకు హక్కులు ఉండవా?"

-సబా, తలాఖ్​ బాధితురాలు, కైరానా

తలాఖ్​ విషయంలో భాజపాకు మద్దతివ్వడంపై ముస్లిం మహిళల్లో ఓ సందిగ్ధం కనిపిస్తోంది. ఈవీఎంపై మీట నొక్కే సమయంలో వారు స్వీయ నిర్ణయం తీసుకుంటారా లేక భర్త ఆదేశానికి కట్టుబడతారా అన్నది ఆసక్తికరం.

New Delhi, Apr 09 (ANI): President Ram Nath Kovind paid tribute at National Police Memorial on the occasion of 54th CRPF Valour Day 2019 in the national capital today. The President presented medals to families of jawans who were killed in line of duty, including the 40 Central Reserve Police Force (CRPF) jawans who lost their lives in Pulwama terror attack which took place on February 14.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.