ETV Bharat / crime

Complaint on constable: పూటుగా తాగేసి గణేశ్ మండపం వద్ద కానిస్టేబుల్ బూతు పురాణం

నాగర్ కర్నూల్‌లో కానిస్టేబుల్‌పై యువకులు ఫిర్యాదు చేశారు(Complaint on constable). గణేశ్ మండపం వద్ద మద్యం మత్తులో దుర్భాషలాడినట్లు ఆరోపించారు. ఈ సంఘటనపై వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో(social media) పోస్టు చేశారు.

Complaint on constable, youth allegations on constable
కానిస్టేబుల్‌పై యువకుల ఫిర్యాదు, కానిస్టేబుల్‌పై ఆరోపణలు
author img

By

Published : Sep 13, 2021, 1:17 PM IST

Updated : Sep 13, 2021, 7:28 PM IST

నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఆదివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించారు . ఎర్రగడ్డ కాలనీలో వినాయక మండపం వద్ద సబ్ జైలు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు మద్యం సేవించి హల్‌చల్‌ చేశారు. గణేశ్ మండపం నిర్వాహకులను అసభ్య పదజాలంతో దూషించారని పలువురు యువకులు ఆరోపించారు. తాము 100కు డయల్‌ చేసినా పోలీసులు స్పందించలేదని బాధితులు వాపోయారు.

సార్ అనవసరంగా తిట్టొద్దు అంటూ కానిస్టేబుల్‌తో మాట్లాడుతుండగా పట్టించుకోకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయారని యువకులు ఆరోపించారు. ఈ గొడవని ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాధిత యువకుడు ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

పూటుగా తాగేసి గణేశ్ మండపం వద్ద కానిస్టేబుల్ బూతు పురాణం

ఇదీ చదవండి: Review Petition in High court: 'నిమజ్జనం ఆంక్షలు సడలించండి... 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తాం'

Last Updated : Sep 13, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.