ETV Bharat / crime

youth commits suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏం రాశాడంటే.. - ఉద్యోగంరాలేదని యువకుడు ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటూ.... ఎప్పటికీ నోటిఫికేషన్​ విడుదల కాకపోవడం వల్ల మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు (youth commits suicide). ఈఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టలో జరిగింది.

suicide
suicide
author img

By

Published : Nov 7, 2021, 8:25 AM IST

"అమ్మా నన్ను క్షమించు... మళ్లీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగానే పుట్టాలి... నాకు బతకాలని లేదు... నా చావుకు ఎవరూ కారణం కాదు... నీ ఆరోగ్యం జాగ్రత్త... నేను నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నాను.." అంటూ జాబ్​ నోటిఫికేషన్​ కోసం ఎదురు చూసి చూసి.. మనస్తాపం చెందిన ఓ యువకుడి ఆఖరి రాత ఇది. ఉద్యోగం రాలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు (youth commits suicide in nalgonda ).

ఆత్మహత్య చేసుకున్న యువకుడి ఆఖరి లేఖ
ఆత్మహత్య చేసుకున్న యువకుడి ఆఖరి లేఖ

నల్గొండ జిల్లా (nalgonda) చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన సపావట్‌ బూర, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు. వారిలో నాలుగో సంతానం నరేశ్​(30) చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండేవాడు. ఎప్పటికైనా సర్కారు కొలువు సాధిస్తానని చెప్పడంతో... కుటుంబ సభ్యులు కూడా కష్టపడి పీజీ వరకు చదివించారు. అయిదేళ్ల క్రితం నరేశ్​ తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.

తండ్రి పోయిన తర్వాత నరేశ్​ ఉద్యోగ వేటలో పడ్డాడు. హైదరాబాద్​ వచ్చేసి పోటీపరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్​ విడుదలకాకపోవడంతో... ఇక్కడే ఉండిపోయాడు. కుటుంబ సభ్యులు పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి... తనకు ఉద్యోగం వస్తేగాని పెళ్లిచేసుకోనని చెప్పడంతో.. తన ఇద్దరి తమ్ముళ్లకు వివాహం జరిపించారు.

'నా చావుకు ఎవరూ బాధ్యులు కారు'

ఇటీవల దీపావళికి ఇంటికొచ్చిన నరేశ్​ను... ఉద్యోగం రాకుండా, పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలమంటూ.... అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు మందలించారు. కుటుంబసభ్యుల మాటలతో మనస్తాపం చెందిన నరేశ్​.. శనివారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రపోతుండగా గదిలో ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారంటూ లేఖరాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

పండగకు వచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఉద్యోగం చేసి స్థిరపడతాడనుకున్న కుమారుడు ఇలా అకాలమరణం పాలవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: Beggar Murder: వైట్‌నర్‌ మత్తులో కత్తితో పొడిచి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.