చిన్ననాటి ప్రేమంటూ, భార్యకు విడాకులిచ్చానంటూ ఓ యువతిని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. సందీప్ ప్రసాద్ అనే వ్యక్తికి ఐదేళ్ల కిందట వివాహమైంది. అతనికి ఒక బాబు ఉన్నాడు. ఐదేళ్ల తర్వాత ఓ ప్రైవేటు సంస్థలో ఐటీ రిక్రూటర్‌గా పనిచేస్తున్న యువతిని కలిశాడు. ఆమెను చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, భార్యకు విడాకులు ఇస్తానంటూ వెంటపడ్డాడు. ఈ విషయంలో సందీప్‌ను పెద్దలు మందలించినా పట్టించుకోకుండా ఆమె వెంట పడటం, వేధించడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి మొదటి వారంలో యాదగిరిగుట్టలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
రెండు నెలలు బాగానే ఉన్నారు. తర్వాత బెంగళూరు వెళ్లిన సందీప్ ప్రసాద్ ఆమెను అక్కడికే రావాలని, లేదంటే పెళ్లి ఫొటోలు ఆమె తల్లిదండ్రులకు చూపుతానంటూ బెదిరింపులకు దిగాడు. మార్చి 31న బెంగళూరు నుంచి వచ్చిన సందీప్ ప్రసాద్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని చెప్పిన అతడు రెండు నెలల పాటు కుషాయిగూడ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. ఈ సమయంలోనే సందీప్ బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి కుటుంబ సభ్యులు రవీందర్, ఇంద్రకుమార్, నాను, అరుణ్ ప్రసాద్‌లు అంతా కలిసి ఆమెను బెదిరించారు. ఆమె ఇష్టంతోనే పెళ్లి జరిగినట్లు బేగంపేట పోలీస్ స్టేషన్లో చెప్పాలంటూ బలవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే యూసుఫ్‌గూడలో నివసిస్తున్న బాధిత యువతి ఫిర్యాదుతో సందీప్‌ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: mla seethakka: 'ఆయన ప్రజల మనిషి'