ETV Bharat / crime

పోయిన చోటే రాబట్టుకోవాలని.. రూ.87లక్షలు కోల్పోయాడు.!

Young Man lost 87 lakhs due to Online Game Case Update: ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ రూ.87 లక్షలు పోగొట్టుకున్న కేసులో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌కు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి పోగొట్టుకున్న సొమ్ము ఫోన్‌పైసా అనే సంస్థ ఖాతాకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి పలు ఖాతాలకు ఎలా బదిలీ అయ్యిందో సమాచారం ఇవ్వాలని ఫోన్‌పైసా సంస్థకు మెయిల్‌ చేశారు. భూమిని ఇవ్వగా వచ్చిన పరిహారం డబ్బు... పోవడంతో తల్లిందండ్రులు మనేవేదనకు గురవుతున్నారు.

Online Game
Online Game
author img

By

Published : Dec 22, 2022, 9:41 AM IST

Updated : Dec 22, 2022, 10:32 AM IST

పోయిన చోటే రాబట్టుకోవాలని.. రూ.87లక్షలు కోల్పోయాడు.!

Young Man lost 87 lakhs due to Online Game Case Update: రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి, విజయలక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చెందిన 10 ఎకరాల భూమిని టీఎస్​ఐఐసీ సేకరించి పరిహారం కింద రూ.1.05కోట్లు ఇచ్చింది. ఇతర భూమిని కొనుగోలు చేసేందుకు 20లక్షలు అడ్వాన్స్​గా ఇచ్చాడు. మిగిలిన డబ్బు తండ్రి ఖాతాల్లో ఉంది. శ్రీనివాస రెడ్డి చిన్న కుమారుడు హర్షవర్దన్ రెడ్డి... నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ గేమింగ్ అలవాటు ఉన్న హర్షవర్ధన్... ఫోన్‌లో వచ్చిన కింగ్ 567.కామ్ అనే యాడ్​పై క్లిక్ చేశాడు.

ఈ వెబ్‌సైట్‌లో తెరిచి కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ ఆడాడు. ఇందుకోసం బ్యాంకు ఖాతా అనుసంధానించాలి. గెలిస్తే.. డబ్బు జమ అవుతుంది. ఓడిపోతే నగదు బదిలీ అంతే మొత్తంలో బదిలీ అవుతుంది. తన ఫోన్ కే తండ్రి బ్యాంకు ఖాతా ఉండటంతో డబ్బులు పెడుతూ ఆడాడు. ఇలా విడతల వారీగా రెండు నెలల్లో ఖాతాలో ఉన్న రూ.87లక్షలు ఖాళీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐటి యాక్ట్ పెట్టారు. దర్యాప్తులో భాగంగా హర్షవర్థన్‌రెడ్డిని పోలీసులు విచారించారు.

శ్రీనివాస రెడ్డి ఎస్​బీఐ ఖాతా నుంచి విడతల వారీగా నగదు ఫోన్‌ పైసా అనే సంస్థ ఖాతాకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి గేమ్‌కింగ్‌ 567 సంస్థ నిర్వహించే వేర్వేరు ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యాయని గ్రహించారు. దీంతో ఆ వివరాలు ఇవ్వాలని ఫోన్‌పైసా సంస్థకు మెయిల్‌ చేసినట్లు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీధర్‌ తెలిపారు. ఆన్ లైన్ గేమింగ్‌పై నిషేధం ఉండటంతో.. తెలంగాణా గేమింగ్ యాక్ట్ కూడా పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

10ఎకరాల భూమి పోగా పరిహారంగా వచ్చిన డబ్బుతో వేరే భూమిని కొందామని ఖాతాలో చూడగా డబ్బులు లేకపోవడంతో కుమారుడి ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహార తెలిసిందని హర్షవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు. ఆధారాన్ని కోల్పోయామని డబ్బులైనా ఇప్పించాలని కోరుతున్నారు.
ఆన్‌ లైన్ గేమ్స్ వల్ల జరగుతున్న మోసాలపై పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కేసులు సంఖ్య తగ్గడం లేదు. కేసులు నమోదవుతున్న వాటిలో విద్యార్దులు, చిన్నారులు ఎక్కువ మంది ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది జులైలో సైబరాబాద్ పోలీసులకు సయ్యద్ అజ్గర్ అలీ అనే వ్యక్తి తన 8ఏళ్ల మనవడు ఆన్‌లైన్ గేమ్ ఆడి 11లక్షలు పోగొట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సింగపూర్​కి చెందిన ఓ ఆన్‌లైన్ గేమింగ్ కంపనీ ఖాతాలో జమ అయినట్లు తెలుసుకున్నారు. దీంతో కంపెనీతో మాట్లాడిన పోలీసులు పోయిన నగదును తిరిగి అదే ఖాతాలో జమ అయ్యేలా చూశారు. ఇలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో నెలకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.