మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ఏరియాకు చెందిన ఏడుకోల విశాల్(21) అనే విద్యార్థి పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సింగరేణి వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్-రాణి దంపతులు.. కుమారుడు విశాల్‌తో కలిసి కూతురును తీసుకువచ్చేందుకు శనివారం హైదరాబాద్‌కు వెళ్లారు. రెండురోజుల పాటు బంధువుల ఇళ్లలో ఉండి సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు.
హైదరాబాద్ నుంచి మందమర్రికి కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం వీరు ప్రయాణిస్తున్న రైలును పెద్దపల్లి స్టేషన్‌లో నిలిపివేశారు. రైలుదిగి, పట్టాలపైకి వెళ్లిన విశాల్‌ను సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామగుండం జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
తండ్రికి అస్వస్థత :
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శవపంచనామా అనంతరం మృతదేహాన్ని మందమర్రికి తీసుకువెళ్లారు. కొడుకు మృతితో తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురవడంతో సింగరేణి డిస్పెన్సరీకి తరలించారు. రెండు గంటల పాటు చికిత్స అందించి ఇంటికి పంపించారు.
- ఇదీ చదవండి : ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి