ప్రేమించిన యువతి నిరాకరించిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె లేనిదే బతకలేనని భావించి బలవన్మవరణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'నా చావుతోనైనా నిజం తెలుసుకుంటావు' అంటూ ప్రియురాలినుద్దేశించి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బీకే గూడలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ గదిలో మృతుడు సుధాకర్(30) తన మిత్రుడు భార్గవ్‌తో కలిసి నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ యువతిని సుధాకర్ ప్రేమించాడు. అతని ప్రేమను నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం చెందాడని వెల్లడించారు. దీంతో అద్దెకుంటున్న గదిలోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Minister Gangula : 'దళితబంధు పథకంతో ఎస్సీల జీవితంలో వెలుగులు'