ETV Bharat / crime

Unemployed Suicide : ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని యువకుడు ఆత్మహత్య - Telangana news

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడి మృతికి ప్రభుత్వమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

Suicide News
ఉద్యోగ నోటిఫికేషన్లు
author img

By

Published : Oct 31, 2021, 4:36 PM IST

మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఉద్యోగం రాకపోవడం వల్లే బలవన్మరణానానికి పాల్పపడ్డాడని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెల్మపల్లె గ్రామ సమీపంలోని పత్తి చేనులో ఆసంపల్లి మహేశ్​... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

Suicide
ఆత్మహత్యకు ఒడిగట్టిన మహేశ్​

మహేశ్​ ప్రస్తుతం టీటీసీ పూర్తి చేసి.. అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. కోటపల్లి మండలం బబ్బెరచెలుకలోని జాతీయ రహదారిపై మహేశ్​ మృతదేహంతో గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు.

ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంలేదని అందుకే మహేశ్​ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సర్కార్ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు. అనంతరం మహేశ్​ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి: Child_Death: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. నీలోఫర్​లో బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.