ఏపీలోని గుంటూరు జిల్లా అరండల్‌పేటలో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. తెలిసిన వారితో బయటకొచ్చిన ఓ యువతిని ప్రేమించమంటూ వెంటపడ్డాడు. కత్తితో ఆమెపై దాడికి యత్నించాడు. ఇంతలో ఆమెతో పాటు ఉన్న స్నేహితులు ఆ ఉన్మాదిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
రెచ్చిపోయిన నిందితుడు.. వారి బైక్ సీటుపై కత్తితో గాట్లు పెట్టాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో.. వారిని చూసి జారుకున్నాడు. ఘటనపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి: మద్యానికి డబ్బు కోసం భార్యతో గొడవపడి... విద్యుత్ వైర్లు పట్టుకున్న భర్త!