ETV Bharat / crime

Young Woman Rape : ఉద్యోగమిస్తానని నమ్మించి యువతిపై అత్యాచారం - young woman rape in chaitanyapuri

తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటుచేసుకుంది. అతణ్నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా.. వారు చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Young Woman Rape
Young Woman Rape
author img

By

Published : Mar 28, 2022, 8:25 AM IST

ఉద్యోగం ఇస్తానని నమ్మబలికిన ఓ ప్రబుద్ధుడు(23) నమ్మి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చైతన్యపురి ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదై ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు చేరిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన ఓ యువతి(19) నాలుగేళ్లుగా దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని చైతన్యపురికాలనీలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది. ఈనెల 7న తనను తాను సిద్ధార్థరెడ్డిగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, రూ.18 వేల వేతనం చెల్లిస్తానని నమ్మబలికాడు. టెలీకాలర్‌ సంస్థ నుంచి తన ఫోన్‌ నంబరు సేకరించినట్లు చెప్పాడు. 9న కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చి యువతిని తన వెంట తీసుకుని ఎర్రగడ్డకు వచ్చాడు. మార్గం మధ్యలో యువతి ఫొటోలు, గుర్తింపు కార్డు పత్రాలు తీసుకున్నాడు. ఎస్సార్‌నగర్‌లోని ఓయో లాడ్జికి తీసుకెళ్లి యువతి పేరిట గది బుక్‌ చేశాడు. ఉద్యోగం గురించి ప్రశ్నిస్తే రాత్రి భోజనం చేసిన తరువాత అడ్వాన్సు చెల్లిస్తానని నమ్మించాడు. లాడ్జి గదిలోకి వెళ్లిన తరువాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే ఫొటోలు మీడియాకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలు తప్పించుకుని వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు కేసును ఎస్సార్‌నగర్‌ ఠాణాకు బదిలీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.