ETV Bharat / crime

మూడేళ్ల కూతురుని చంపి ఉరేసుకున్న తల్లి - హైదరాబాద్​ తాజా వార్తలు

సికింద్రాబాద్​ అల్వాల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మానసిక రుగ్మతల కారణంగా ఓ మహిళ మూడేళ్ల కూతురుకి ఉరి వేసి అనంతరం తనూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

woman killed her three year old daughter and committed suicide
మూడేళ్ల కూతురుని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న మహిళ
author img

By

Published : Apr 24, 2021, 11:27 AM IST

మానసిక రుగ్మతల కారణంగా ఓ మహిళ... మూడేళ్ల కూతురుకి ఉరివేసి తనూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన... సికింద్రాబాద్ ఆల్వాల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 22న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రంలోని మీయూరభంజ్ జిల్లా బారిపాడకు చెందిన సుధేందుగిరి జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. అల్వాల్ పరిధిలోని భరత్ నగర్​లో నివసిస్తూ... సిద్దిపేట ప్రాంతంలోని ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆయనకు దాదాపు ఎనిమిదేళ్ల కిందట బిష్ణుప్రియ(30) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి మూడున్నరేళ్ల కూతురు ప్రీతిక సంతానంగా జన్మించింది. ఈ నెల 22న ఉదయం సుధేందుగిరి రోజువారిగానే తన ఉద్యోగానికి బయలుదేరాడు. అతను తిరిగి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి... తల్లీకూతుళ్లు విగతజీవులై కనిపించారు.

మొదట కూతురుకి చంపి...

మొదట కూతురు ప్రీతికకు చంపి... అనంతరం బిష్ణుప్రియ చీరతో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించినట్లు సుధేందుగిరి... వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనకు సంబంధించి ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.