పెళ్లి పేరిట తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన ఓ మహిళ పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. శివకుమార్‌రెడ్డి వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని.. ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
హోటల్‌కు పిలిపించి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. శివకుమార్ రెడ్డి తన భార్య మూడేళ్ల కంటే బతకదని చెప్పి తన మెడలో పసుపుతాడు కట్టాడని ఫిర్యాదు పేర్కొంది. ఆయన తనకు పసుపుతాడు కట్టి కామవాంఛ తీర్చుకున్నాడని వెల్లడించింది. ఇప్పుడు శివకుమార్‌రెడ్డి తన అనుచరులతో బెదిరిస్తున్నాడని మహిళ ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో శివకుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: