తన తండ్రికి చున్నీతో ఉరేసి తల్లే హతమార్చిందని(wife killed husband) కుమారుడు అనుమానించాడు. వెంటనే తన బాబాయికి ఈ విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసముండే జగదీశ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సుశ్రితను 2007లో వివాహం చేసుకున్నాడు. వీరు 11 ఏళ్ల తమ కుమారుడితో కలిసి బంజారాహిల్స్‌లో నివాసముంటున్నారు. జగదీశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జులై 16న జగదీశ్ అకాల మరణం చెందాడు. తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని సుశ్రిత కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు జగదీశ్ మృతదేహానికి తమ స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇటీవల జగదీశ్ కుమారుడికి తన తండ్రిని హత్య(wife killed husband) చేసింది తల్లేనని అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని జగదీశ్ సోదరుడు ప్రసాద్‌కు చెప్పాడు. ఇద్దరు కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.