ETV Bharat / crime

ఇంటి ఓనరుతో వివాహేతర సంబంధం.. తప్పని చెప్పిన భర్తను..

Wife killed her husband: వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. ప్రియుడితో ఊహల్లో తేలుతున్న భార్యకు తప్పని చెప్పి నచ్చజెప్పిన భర్తనే పొట్టనపెట్టుకుంది ఆ ఇల్లాలు. ఈ దారుణం ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది.

Wife killed her husband
భర్తను చంపిన భార్య
author img

By

Published : May 2, 2022, 1:55 PM IST

Wife killed her husband: భార్య వివాహేతర సంబంధం తెలిసిన భర్త.. ఆమెను గెంటేయలేదు. పిల్లలను అనాథలు చేయెద్దనే ఉద్దేశంతో ఆమెను మార్చుకోవాలని చూశాడు. పలురకాలుగా నచ్చజెప్పాడు. పిల్లలు ఎదుగుతున్నారని.. ప్రియుడితో తిరగడం ఆపాలని పదేపదే చెప్పి చూశాడు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు సరికదా.. ప్రియుడి మోజులో పడి భర్తతో వైరం పెంచుకుంది. చివరికి కట్టుకున్న భర్తనే చంపించింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించింది. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేయగా.. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. హత్యగా నిర్ధరించి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఈ దారుణం వెలుగుచూసింది.

మెరకముడిదాం గ్రామానికి చెందిన అట్టాడ చంద్రశేఖర్‌ మిమ్స్‌లో క్లర్కుగా పని చేస్తున్నారు. ఆయనకు 16 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని వెంకటాపురానికి చెందిన అరుణ జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరంతా నెల్లిమర్ల మండలంలోని గొల్లవీధికి చెందిన కె.రాంబాబు ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ సమయంలో రాంబాబు, అరుణ జ్యోతి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత చంద్రశేఖర్‌ భార్యతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అనంతరం తరచూ రాంబాబు ఇంటికి రావడాన్ని గమనించిన చంద్రశేఖర్‌ ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ప్రియుడి వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె.. శ్రీకాకుళంలో ఉన్న తల్లి సత్యవతి సహకారం కోరింది. ఆమె రూ.20 వేలు ఇవ్వగా, ప్రియుడు మరో రూ.20 వేలు సమకూర్చాడు. ఈ సొమ్ము తీసుకొని తన భర్తను చంపాలని నెల్లిమర్ల మండలంలోని ఎర్రంశెట్టి సతీష్‌ను పురమాయించింది.

అనుమానం రాకుండా: ఈ నెల 24న రాత్రి మాట్లాడాలని ఉందని చంద్రశేఖర్‌ను రాంబాబు బయటకు తీసుకువెళ్లాడు. వీరు మాట్లాడుతుండగా చంద్రశేఖర్‌ తలపై వెనుక నుంచి వచ్చిన సతీష్‌ రాడ్డుతో కొట్టాడు. తీవ్రగాయమవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనుమానం రాకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు. అరుణ జ్యోతి మీద అనుమానం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకున్నారు. ఆమెతో పాటు తల్లి సత్యవతి, రాంబాబు, సతీష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మంగవేణి తెలిపారు. కేసును ఛేదించిన ఎస్‌ఐలు పి.నారాయణరావు, కిరణ్‌కుమార్‌ నాయుడు, నసీమా బేగమ్‌ తదితరులను ఆమె అభినందించారు.

ఇవీ చదవండి: 'కరోనా టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దు'

చేతబడి నింద.. ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.