ETV Bharat / crime

ఉపాధ్యాయుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

author img

By

Published : Feb 17, 2021, 7:17 AM IST

ఓ విద్యార్థినిని మార్కుల పేరుతో మచ్చిక చేసుకొని, ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఓ ఉపాధ్యాయుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.4,500 జరిమానా విధిస్తూ వరంగల్‌లోని పోక్సో కోర్టు, మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కావూరి జయకుమార్‌ మంగళవారం తీర్పు చెప్పారు.

warangal pocso court Strict imprisonmented Imposed to private teacher
ఉపాధ్యాయుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

వరంగల్‌లోని పోక్సో లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బాధిత బాలికకు నష్టపరిహారం కింద రూ.2 లక్షలు తక్షణమే అందజేయాలని పోక్సో కోర్టు, మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కావూరి జయకుమార్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

హన్మకొండలోని రాంనగర్‌ ప్రాంతానికి చెందిన శివసాని సాయిమణిదీప్‌ ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని (15)కి యూనిట్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు వేస్తానని చెప్పి మచ్చిక చేసుకున్నాడు. వార్షిక పరీక్షల అనంతరం బుద్దారంలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమెను 2016 ఏప్రిల్‌ 29న మాట్లాడే పని ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై హన్మకొండ న్యూశాయంపేటలోని తెలిసిన వారి ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు కొత్తగూడ మండలం కుందనపల్లిలోని తెలిసిన వారింటికి తీసుకెళ్లాడు.

కొద్దిరోజులపాటు అక్కడే ఉండి మే 3న మరో గ్రామానికి తెలిసిన వారింటికి తీసుకెళ్లాడు. మే 9న ఖమ్మం జిల్లా ఇల్లందు కోట మైసమ్మ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. అదే రోజు అక్కడే ఓ లాడ్జిలో ఆ బాలికపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు న్యూశాయంపేటకు వచ్చారు. ఈ విషయాన్ని బాలిక కుటుంబీకుల ద్వారా తెలుసుకున్న పోలీసులు 17న న్యూశాయంపేటకు వచ్చి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడితో పాటు ఆశ్రయం ఇచ్చిన దంపతులు, వివాహం చేసిన ఓ పూజారిపై గణపురం పోలీసులు కేసు పెట్టారు. ఉపాధ్యాయుడు మినహా మిగతావారిపై నేర నిరూపణ కాకపోవటంతో వారిపై కోర్టు కేసును కొట్టివేసింది. తాజాగా నిందితుడికి శిక్షలు ఖరారు చేస్తూ పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది.

ఇదీ చదవండి: వ్యవసాయ కోర్సుల్లో విద్యార్థినుల హవా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.