ETV Bharat / crime

తాళం వేసిన ఇంట్లో చోరీ.. ఆభరణాలు అపహరణ - ఆభరణాలు అపహరణ

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో.. దొంగ బీభత్సం సృష్టించాడు. తాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డాడు. పలు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు.

robbed a locked house
ఆభరణాలు అపహరణ
author img

By

Published : Mar 26, 2021, 9:51 PM IST

గుర్తు తెలియని దుండగుడు.. తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి పలు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది. 4 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు.. రూ. 30 వేల నగదును అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉప్పరపల్లి రోడ్‌లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి హన్మంతు.. కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఊరికి వెళ్లారు. ఇంటి తాళం పగిలి ఉండటం గమనించిన పక్కింటి వారు.. యజమానికి సమాచారమిచ్చారు. బాధితుల ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పురుగుల మందుతో.. మందలపల్లి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.