ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిల్లక భవ్యశ్రీ అనే మూడేళ్ల చిన్నారిని వరసకు మేనమామ అయ్యే వినోద్ అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. గత అర్ధరాత్రి చిన్నారి నిద్రిస్తున్న సమయంలో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.
వినోద్ మతిస్థిమితం సరిగా లేక దారుణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఘటనా స్థిలికి చేరుకున్న ఎల్విన్‌పేట ఎస్సై కృష్ణ ప్రసాద్ ప్రాథమిక విచారణ చేపట్టారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: వేగంగా వచ్చి.. బస్సుని ఢీకొని యువకుడు మృతి