ETV Bharat / crime

దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరి అరెస్ట్​ - dcp rakshitha latest news

నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులకు పోలీసులు చెక్​ పెట్టారు. బోడుప్పల్​లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Two thiefs arrested by rachakonda police
దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరి అరెస్ట్​
author img

By

Published : Jan 25, 2021, 6:04 PM IST

నగరంలోని ఇళ్లల్లో రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్​ మల్లాపూర్​కు చెందిన చందన్​, శంకరయ్యలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి భారీగా బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఇదివరకే జవహర్​నగర్, తూప్రాన్, బోయిన్​పల్లి పరిధిలో దొంగతనాల కేసుల్లో జైలుకి వెళ్లొచ్చినట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. మేడిపల్లి పోలీస్​ స్టేషన్ పరిధిలో 3, నాచారం పీఎస్ పరిధిలో ఒకటి చొప్పున దొంగతనాలు చేసినట్లు పేర్కొన్నారు. బోడుప్పల్​లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. మేడిపల్లి క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని వివరించారు.

ఇదీచూడండి: జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్​పై కౌంటర్ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.