TWO PERSONS DROWNED IN A RIVER: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో విషాదం నెలకొంది. మానేరు వాగులోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు శవాలై తేలారు. కందికట్కూర్ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన రేపాక గ్రామానికి చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పొన్నం రాజు మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం మానేరు వాగులో స్నానానికి వెళ్లారు. మధ్యమానేరు గేట్ల ద్వారా వస్తున్న నీటితో మానేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వారు ఆ ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. వెంటనే గ్రామస్థులు మధ్యమానేరు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో గేట్లను మూసివేశారు. గల్లంతయిన వారి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. ఇరువురి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
సరికొత్త పంథాలో చోరీ.. కారు ముందు నోట్లు విసిరి.. తెలివిగా బురిడీ!