ETV Bharat / crime

Two Murders: యాసిడ్‌ పిచికారీ చేసి.. మారణాయుధాలతో దాడి - కర్నూలు జిల్లా ముఖ్య వార్తలు

TWO MURDERS: సామాజిక మాధ్యమాల వేదికగా రెండు వర్గాల మధ్య నెలకొన్నభూ వివాదం.. చిలికి చిలికి గాలివానైంది. వివాదంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల ప్రాణాలను బలికొంది. పట్టపగలే.. మారణాయుధాలతో దాడి చేయటమే కాకుండా... పెట్రోలు పోసి నిప్పంటించి... కిరాతకంగా హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలో జరిగింది.

TWO MURDERS:
TWO MURDERS:
author img

By

Published : Jan 28, 2022, 8:30 AM IST

సామాజిక మాధ్యమాల వేదికగా రెండు వర్గాల మధ్య నెలకొన్న భూ వివాద ఆరోపణలు సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు బలిగొన్నాయి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం కామవరంలో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరోపణలపై మాట్లాడేందుకు వడ్డె మల్లికార్జున ఇంటి వద్దకు సర్పంచి సోదరుడు శివప్పతోపాటు 30 మంది వరకు వెళ్లారు. అప్పటికే ప్రణాళికతో ఉన్న మల్లికార్జున, రాజు, రామాంజి, ఈశ్వర్‌, గోపాల్‌, చంద్రతోపాటు మరికొందరు మహిళలు రాళ్లు, కారంతో ఒక్కసారిగా దాడికి దిగారు. ప్రతిఘటించబోయిన వారిపై పురుగులమందు పిచికారీ చేసే స్ప్రేయర్‌లో యాసిడ్‌ కలిపి చల్లడంతో వచ్చిన వారంతా పరుగులు పెట్టారు. ఈ క్రమంలో హరిజన శివప్ప(45), భాస్కర్‌ అలియాస్‌ గట్టు ఈరన్న (47)పై కొడవళ్లు, గొడ్డలి, ఉలి వంటి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టారు. కొనఊపిరితో ఉన్న ఈరన్నను బంధువులు ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘర్షణలో సత్యప్ప, బజారప్ప, అయ్యప్ప, పెద్దతిమోతి, ఇస్మాయిల్‌కు గాయాలవగా ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో బజారప్ప, సత్యప్పల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు.

...
...

ఇదీ ‘పంచాయితీ’

కామవరానికి చెందిన బోయ మునీంద్రయ్యకు 254 సర్వే నంబరులో ఏడెకరాల భూమి ఉంది. దాన్ని ఆనుకొని ఉన్న పోరంబోకు భూమిని సాగు చేసుకొంటున్న వడ్డె మల్లికార్జున... మునీంద్రయ్య పొలం కొంటానంటూ కొంత నగదు చెల్లించి చాలా ఏళ్ల కిందట ఒప్పందం చేసుకొన్నారు. పూర్తి సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండానే మల్లికార్జున కుటుంబం భూమిపై సాగులోకి వెళ్లింది. ఈ వివాదం కోర్టుకు చేరింది. కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా పొలంలోకి రానివ్వడం లేదంటూ మునీంద్రయ్య గ్రామంలోని వైకాపా నాయకుడు మహేంద్రారెడ్డిని ఆశ్రయించారు. విషయం తెలుసుకొన్న మల్లికార్జున... భాజపా నాయకులతో ప్రెస్‌మీట్‌ పెట్టించారు. భూ కబ్జాదారు అంటూ వైకాపా నాయకుడిపై సామాజిక మాధ్యమాల్లో వార్తల క్లిప్పింగ్‌లు పెట్టారు. ఈ నేపథ్యంలో భూ వివాదంపై వారం వ్యవధిలో ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌కూ వెళ్లారు. మరోవైపు తనపై ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలుసుకొని, పిలుచుకొని రావాలంటూ మహేంద్రారెడ్డి చెబితే వెళ్లామని క్షతగాత్రుల్లో కొందరు చెబుతున్నారు. ఊహించని విధంగా వారిపై దాడికి పాల్పడిన మల్లికార్జున బంధువులు.. వెంటనే ఇంటికి తాళాలేసి పరారయ్యారు.

...

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆదోని ప్రభుత్వాసుపత్రికి వచ్చి క్షతగాత్రులతో మాట్లాడారు. అనంతరం ఘటన జరిగిన కామవరానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ తగాదాయే హత్యలకు కారణమైందన్నారు. వేట కొడవళ్లతో దాడికి పాల్పడగా ఇద్దరు మృతి చెందారని, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించిన రాష్ట్ర వైకాపా నాయకుడు వై.ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ మహేంద్రారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారంపై అడిగేందుకు వెళ్లగా దాడి చేశారన్నారు. కామవరంలో జరిగిన ఘర్షణలో శివప్ప, ఈరన్న హత్యకు గురికాగా.. బజారప్ప, సత్యన్న, అయ్యప్పలు తీవ్రంగా గాయపడ్డరని తాలుకా సీఐ పార్థసారథి తెలిపారు. దాడులకు పాల్పడిన వడ్డే మల్లికార్జున, రాజు, గోపాల్‌లతో పాటు మరో నలుగురు వ్యక్తులు, నలుగురు మహిళలు మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిందితుల్లో అయిదుగురు వ్యక్తులు 2009లో వారి చిన్నాన్న హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.