కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేసేందుకు... తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇమాద్ నగర్ బస్తీకి చెందిన ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల తర్వాత ప్రజలు ఎవరూ రోడ్ల పైకి రాకుండా... ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు.
ఆ సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా... కనీసం తలకు హెల్మెట్, మొహానికి మాస్క్ కూడా లేకుండా అటుగా వచ్చిన యువకుని వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన సదరు వాహనదారుడి సోదరుడు పోలీసులపై రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వాహనంపై వెళుతున్న యువకుడు సైతం పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు.
ఇదీ చదవండి: దేశంలో 9.54 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు