భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జూలూరుపాడు మండలం పాపకొల్లులో సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. రోజువారీ పనుల్లో భాగంగా గ్రామానికి చెందిన నర్సింహారావు (34), బాబూరావు(42)లు మరికొందరు కూలీలతో కలిసి పశువుల ఎరువు తోలే పనికి వెళ్లారు. పని అనంతరం నరసింహారావు, బాబూరావులు స్నానం చేసేందుకని సీతారామ ప్రాజెక్టు కాలువ నీటిలోకి దిగారు. లోతును సరిగా అంచనా వేయలేక మునిగిపోయారు.
కాసేపటి తర్వాత గమనించిన తోటి కూలీలు.. వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..
భద్రాద్రిలో విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు
ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్.. కట్ చేస్తే జైల్లో ఊచలు లెక్కపెడుతూ..