Fire accident: ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో ఆకుల వారి వీధిలో ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో తల్లీకుమార్తె సజీవ దహనమయ్యారు. ఒక ఇంట్లో నివసిస్తున్న తల్లి సాధనాల మంగాదేవి(40), కుమార్తె జ్యోతి(23) మంటల్లో కాలిపోయారు.
జ్యోతికి ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆమె ఐదో నెల గర్భిణి అని.. భర్త సురేష్ నిన్న రాత్రి ఆమెను పుట్టింటి వద్ద దింపి వెళ్లాడని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: