Bees attack: అనారోగ్యంతో మృతిచెందిన వ్యక్తి దహనసంస్కారాల కోసం వెళ్తున్న వారిపై తేనెటీగలు దాడిచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లసింగయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. నల్లసింగయ్యగారి పల్లికి చెందిన కేశవరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. ఆయన అంతిమయాత్రలో బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.
ఈ సమయంలో అక్కడ చెట్టుపై ఉన్న తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. తేనెటీగల దాడిలో 21 మంది గాయపడ్డారు. వీరిని నల్లమాడ, కదిరి ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు.
ఇవీ చదవండి: