సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని బాహ్య వలయ రహదారి బ్రిడ్జ్ కింద విధుల్లో భాగంగా సత్యం అనే వ్యక్తి ట్రాక్టర్ ట్యాంకర్‌తో వచ్చాడు. మొక్కలకు నీరు పడుతుండగా ఓ టిప్పర్ అతివేగంతో అక్కడకు దూసుకొచ్చి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో సత్యం అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. యువతి మృతి