నిజామాబాద్ నగరంలో శుక్రవారం రోజున అపహరణకు గురైన చిన్నారి(CCTV Footage Of Kidnap) ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మెట్‌పల్లి నుంచి నిజామాబాద్‌కు షాపింగ్ కోసం రాగా మధ్యాహ్నం బిల్లు చెల్లిస్తున్న సమయంలో మూడేళ్ల పాపను బురఖా ధరించిన మహిళలు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి... సీసీటీవీ దృశ్యాల(CCTV Footage Of Kidnap) ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు మెట్‌పల్లికి చెందిన నూరిన్ సుల్తానా సల్మాన్ కుటుంబం తమ కుమార్తెతో కలిసి వచ్చారు. షాపింగ్ పూర్తి చేసుకుని కౌంటర్లో బిల్లు చెల్లిస్తున్న సమయంలో కుమార్తె.. అదృశ్యమైంది. ఆమె కోసం షాపింగ్ మాల్ మొత్తం వెతికారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిందేమోనని చూస్తే.. బురఖా ధరించిన మహిళ పాపను తీసుకెళ్లడం చూశారు. ఆమెను వెంబడించేలోగానే...మాయమవ్వడంతో పట్టుకోలేకపోయారు. చిన్నారి తల్లి నూరిన్ సుల్తానా, తండ్రి సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల(CCTV Footage Of Kidnap) ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.