ప్రేమ విఫలమయిందన్న కారణంతో ఒకరు.. బతుకు భారమైందన్న బాధతో మరొకరు.. అనుమానాస్పద స్థితిలో ఇంకొకరు.. తనువు చాలించిన ఘటనలు వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నాయి. పట్టణంలోని రాయగడ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ (25 ).. ఇష్టపడిన అమ్మాయి, తన ప్రేమను నిరాకరించిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటి ముందున్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరొక ఘటనలో..
గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన తెలుగు రాములు (65).. కుటుంబసభ్యుల ఆదరణ కరవైందని తీవ్ర మనస్తాపం చెందాడు. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అనుమానాస్పద మృతి..
పోలికే పాడులో.. చేపల వేటకు వెళ్లిన మెట్టుగడ్డ శాంతయ్య (40).. మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. గోపాలపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువులో.. శవమై తేలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: అడ్డు వస్తున్నాడని పసివాడి ప్రాణాలు తీశాడు