నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు వీఆర్వోలు రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. బల్మూర్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బాలరాజు అనే మాజీ సైనికుడికి భూమి కేటాయింపు విషయంలో తహశీల్దార్ రాధాకృష్ణ రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. తహశీల్దార్‌కు సన్నిహితంగా ఉండే ముగ్గురు వీఆర్వోలు బాల్‌నారాయణ, చిన్నయ్య, బుచ్చి రాములు ద్వారా ఎకరాకు రూ. లక్ష చొప్పున ఐదు ఎకరాలకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... వీఆర్వో బుచ్చి నారాయణ సొంత గ్రామం తెలకపల్లి మండలం లక్నారంలో పొలం వద్ద రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ శ్రీనివాసులు, ఫాయాజ్ బృందం వలపన్ని పట్టుకున్నారు.
![అనిశా వలకు చిక్కిన ముగ్గురు వీఆర్వోలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-6-23-acb-3vro-trab-avb-ts10050_23032021203645_2303f_1616512005_656.jpg)
తహసీల్దార్ రాధాకృష్ణను కూడా విచారించి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్ రాధాకృష్ణ.. వీఆర్వోల ద్వారా డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు చెప్పుకొచ్చాడు. వీఆర్వో వ్యవస్థ లేకున్నా... తహశీల్దార్ రాధాకృష్ణనే అతనికి సన్నిహితంగా గతంలో వీఆర్వో పోస్టుల్లో ఉన్న వీరితో లంచం డబ్బులు డిమాండ్ చేయించినట్లు బాలరాజు తెలిపాడు.
ఇదీ చూడండి: 'త్వరలోనే.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు'