ETV Bharat / crime

లైవ్ వీడియో: అప్పు చెల్లించలేదని చితక్కొట్టారు! - Nellore city latest news

ఓ వ్యక్తిపై ముగ్గురు దాడికి పాల్పడిన ఘటన ఏపీలోని నెల్లూరులో జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

three-persons-indiscriminately-attacked-a-man-in-nellore
లైవ్ వీడియో: నెల్లూరులో వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి
author img

By

Published : Jan 28, 2021, 7:55 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో అప్పు వివాదంతో ఓ వ్యక్తిపై ముగ్గురు విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

'నెల్లూరుకు చెందిన ప్రసాద్ రావుకు సాయి జగదీశ్​ కొంత డబ్బు అప్పు ఇచ్చాడు. డబ్బులు తిరిగి చెల్లించకపోవటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. సాయి జగదీశ్​​ను ప్రసాద్ రావు కొట్టాడు. కొన్ని రోజుల తరువాత డబ్బు తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో ఈ నెల 24న నగరంలోని బాబూ జగజ్జీవన్​ రామ్ కాలనీలో ఒంటరిగా ఉన్న ప్రసాద్​ రావుపై జగదీశ్​.. తన మిత్రులు సతీష్, అబ్ధుల్ అజీబ్​లతో కలిసి దాడి చేశాడు. ఇటుక రాళ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు' అని నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దాడి దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

ఇదీ చదవండి: కోడి పందాల స్థావరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.