టెలీ కమ్యూనికేషన్లోని లోపాలను పసిగట్టి భారీ మోసానికి తెరలేపిన ముగ్గురు కేటుగాళ్లను... రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. వారు అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను... లోకల్ కాల్స్‌గా మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఏసీపీ సంజయ్ కుమార్ వెల్లడించారు.
రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద సెల్వా టెక్నాలజీ అనే పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులు మహ్మద్ అశ్వక్, మహమ్మద్ నజీర్, షేక్ అక్బర్లను అదుపులోకి తీసుకుని... వారి నుంచి రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: వేట కొడవలితో అన్నను నరికి చంపిన తమ్ముడు