రైల్లో తన బ్యాగు పోయిందని ఓ యువకుడు మరో ప్రయాణికుడి బ్యాగును చోరీ చేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చేసరికి తన బ్యాగు, దుస్తులు లేకపోవడంతో బాధితుడు టవల్‌తోనే వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళానికి చెందిన మూల సునీల్‌కుమార్(24) హైదరాబాద్‌కు రైల్లో వస్తుండగా అతని బ్యాగు పోయింది. దీంతో మరొకరి బ్యాగును చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఉదయం స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో విజయనగరంలో టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివశంకర్ రైలు దిగాడు. మీటింగ్ కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లాల్సి ఉండడంతో వెయిటింగ్ హాల్‌లో బ్యాగును ఉంచి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అతను తిరిగొచ్చేలోపు దుస్తులు, సెల్‌ఫోన్, రూ.7వేలు నగదు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. ఒంటిపై టవల్‌తో మాత్రమే ఉన్న అతడు అలాగే జీఆర్పీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన బ్యాగు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
పోలీసులు అతడికి వారి వద్ద ఉన్న దుస్తులు ఇచ్చారు. పోలీసుల మొబైల్ నుంచి బాధితుడు తన స్నేహితులకు ఫోన్ చేశాడు. వారు వచ్చాక దుస్తులు కొనుక్కొని కార్యాలయానికి వెళ్లాడు. పోలీసులు సీసీకెమెరాల్లో రికార్డుల ఆధారంగా నిందితుడిని పట్టుకుని రూ.7వేల నగదు, బ్యాగుతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: