మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి ఐజీ కాలనీలోని శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి హుండీలను ధ్వంసం చేసి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులను దోచుకున్నారు. రెండేళ్లలో నాల్గుసార్లు దొంగతనం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పుస్తకోద్యమం!