ETV Bharat / crime

Theft in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ సామగ్రి చోరీ

Theft in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్​లో విద్యుత్​ సామగ్రిని చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్​ ఉప కేంద్రం నిర్మాణానికి సంబంధించిన టవర్లు, ఇతర సామగ్రిని ఇటీవల కొందరు యువకులు అపహరించినట్లు సమాచారం.

Theft in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ సామగ్రి చోరీ
Theft in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ సామగ్రి చోరీ
author img

By

Published : Dec 26, 2021, 3:08 PM IST

Theft in Kaleshwaram Project: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్​లో విద్యుత్​ సామగ్రిని చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 220 కేవీ అదనపు విద్యుత్​ ఉప కేంద్రం నిర్మాణానికి సంబంధించిన టవర్లు, ఇతర సామగ్రిని ఇటీవల కొందరు యువకులు అపహరించినట్లు సమాచారం. నిర్మాణ పనులకు సంబంధించిన గుత్తేదారు దీనిపై పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

దీనిపై పోలీసులు విచారణ చేపట్టి కొందరు యువకులను గుర్తించి మందలించినట్లు తెలిసింది. చోరీ చేసిన సామగ్రి విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుంది. చోరీకి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్​ పోలీసులు తెలిపారు. కొనుగోలు చేసిన వారిని విచారిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

Mother and daughter died in mulugu : కుమార్తె మరణ వార్త విని తల్లి గుండె ఆగింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.