ETV Bharat / crime

టాస్క్​ఫోర్స్ తనిఖీలు.. పీడీఎస్ బియ్యం పట్టివేత

హన్మకొండలోని కిట్స్ కళాశాల ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బియ్యం విలువ దాదాపు రూ.4,60,000 ఉంటుందని తెలిపారు. నిందితుడిని, బియ్యం, లారీని కేయూ ఠాణాలో అప్పగించినట్లు వెల్లడించారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత
పీడీఎస్ బియ్యం పట్టివేత
author img

By

Published : Mar 19, 2021, 2:15 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేయూ పోలీస్​ స్టేషన్ పరిధిలోని కిట్స్ కళాశాల ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ దాదాపు రూ.4,60,000 ఉంటుందని వెల్లడించారు.

హన్మకొండ కిట్స్ కళాశాల వెనక పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. హసన్​పర్తి గ్రామానికి చెందిన మోటం అనిల్ అనే వ్యక్తి.. బియ్యం బస్తాలను లారీలోకి నింపుతుండగా అదుపులోకి తీసుకున్నారు.

మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గ్రామాల్లో బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి, మహరాష్ట్రలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు. నిందితుడితో సహా బియ్యం, లారీని కేయూ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పురుగుల మందు తాగి కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.